![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో భరణి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఇక వచ్చీ రాగానే భరణి చేతిలో ఒక స్వీట్ పెట్టాడు శివాజీ. ఎలా ఉంది సర్ అని అడిగితే చాలా బావుందని భరణి చెప్పాడు. మీకే ఇస్తే సరిపోదు కాబట్టి ఇది మీ అమ్మాయికి అంటూ మరో స్వీట్ ఇచ్చాడు. అది కూడా నవ్వుతూనే తీసుకున్నాడు భరణి. కానీ శివాజీ అంతటితో ఆగకుండా ఇదెవరికి చెప్పండి అంటూ మరొకటి.. ఇదెవరికి అంటూ ఇంకో స్వీట్ ఇలా ఇస్తూ పోయాడు. ఇక సర్లే అని భరణి కూర్చున్న తర్వాత కుటుంబం అన్నగారి కుటుంబం.. అంటూ శివాజీ పాడాడు. దీనికి నాకు ఎక్కడా ఈ బాండ్స్ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేను అయితే అనుకోలేదని భరణి చెప్పాడు. మీరు గేమ్ ఆడానని అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు.. బాండింగ్స్‌లో స్టక్ అయిపోయారు.. ఈ కలుపుకోవటాలు ఏంటి మనకి ఎందుకు అసలు అంటూ శివాజీ అడిగాడు. నేను కలుపుకోలేదు కదండి అని భరణి అన్నాడు.
ఇమ్మాన్యుయల్ నీతో అంత బాగా ఉంటాడు కదా మరి.. ఎందుకని పవరస్త్ర నీకు వాడలేదని శివాజీ అడుగగా.. అది అతడి స్ట్రాటజీ అని భరణి అన్నాడు. ఎక్కడ ఏం చేస్తే తనూజమ్మ ఫీలవుద్దో.. దివ్య ఫీలవుతుందోనని కంప్లీట్‌గా ఇలాగే ఉండిపోయారండి అని శివాజీ అనగానే.. పర్టికులర్‌గా వీళ్లిద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదని భరణి అన్నాడు. ఆగిపోకపోతే ఇవాళ భరణి బయటికి రారు.. భరిణిని అన్ని మాటలంటే బయట ఊరుకుంటాడా అని శివాజీ ప్రశ్నించాడు. నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగానే మాట్లాడానండి అని భరణి తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. సంజన నామినేషన్ వచ్చినప్పుడు మీరు చాలా గట్టిగట్టిగా నేను సాక్రిఫైజ్ చేస్తే నువ్వు ఇక్కడున్నావ్.. ఎందుకలా సడెన్‌గా రియల్ భరణి బయటికొచ్చాడని శివాజీ అన్నాడు. నేను మాములుగానే చాలా షార్ట్ టెంపర్డ్.. ఊరికే సమ్మని లెగుస్తుంది నాకు కానీ హౌస్ లో చాలా తగ్గి ఉన్నానని భరణి చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత సోషల్ మీడియలో పెట్టిన ఒక ట్వీట్ ని స్క్రీన్ మీద చూపించాడు శివాజీ. ఎందుకు అసలు అంత ఓవర్‌గా.. అంత బాండ్ ఉందా వీళ్ల మధ్య.. చాలా సెంటిమెంట్ ఉందిగా సింపథీ కోసమా అని ట్వీట్ ని చదివాడు భరణి. ఎవరన్నా వచ్చి నాకు బాధ చెప్పుకునేవారు తప్ప నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరూ లేరు.. అని భరణి చెప్పాడు. ఈ హౌస్‌లో ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అంటాను.. అంటూ శివాజీ అన్నాడు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో క్రాకర్ ని డెడికేట్ చేశాడు. భూచక్రం రీతూకి, డీమాన్ కు చిచ్చుబుడ్డి, కాకరపువ్వు సంజనకి, లక్ష్మీ బాంబు ప్రియకి ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో క్రాకర్ డెడికేట్ చేశాడు భరణి.
![]() |
![]() |